మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్ :

 మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ శాంతి, సంతోషం, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. శాంతి సామరస్యాలతో, సోదర భావంతో మెలగాలని ప్రవక్త సందేశమిచ్చారని వైయస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లిం సోదరులు సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటున్నారు.


Back to Top