ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

హైదరాబాద్ః 640 టన్నుల జీఎస్ఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని వైయస్ జగన్ కొనియాడారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  శ్రీహరికోటలోగల సతీష్‌ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్‌) నుంచి సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది.

దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్‌-19ని రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ,136 కిలోల బరువైన జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ తో దశాబ్దాల నాటి ఇస్రో కల నెరవేరింది. 

Back to Top