శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్


హైదరాబాద్) వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకల్ని పార్టీ అధ్యక్షులు వైెఎస్ జగన్ నిర్వహించారు. స్వయంగా కేక్ కట్ చేయించి ఆమెకు తినిపించారు. ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ ఆయన సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. అమ్మ పుట్టిన రోజు వేడుకలు అని వ్యాఖ్యానిస్తూ... నాలుగు ఫోటోలను విడుదల చేశారు. 
మరో వైపు జిమ్నాస్టిక్స్ లో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో మనకు ప్రాతినిధ్యం లభించింది. ఈ ఘనత సాధించిన దీపా కర్మాకర్ కు అభినందనలు తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 

Back to Top