చిన్నారుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్షలు

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నారుల‌కు బాల‌ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జా సంకల్ప యాత్ర‌లో భాగంగా ముత్యాల‌పాడుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను చిన్నారులు క‌లిసి గులాబీలు అంద‌జేశారు. వీరికి వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపి, బాగా చ‌దువుకోవాల‌ని సూచించారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే మీ  అంద‌ర్ని నేనే చ‌ద‌విస్తాన‌ని మాట ఇచ్చారు. ఇవాళ మాజీ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా బాల‌ల దినోత్స‌వం నిర్వ‌హిస్తున్నారు.
 

Back to Top