గుంటూరు జిల్లాకు వైయస్ జగన్

గుంటూరు) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ శుక్రవారం నాడు గుంటూరు
జిల్లా లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడ గన్నవరం
విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడ నుంచి రోడ్ మార్గంలో ఉదయం పదిన్నర గంటల సమయంలో
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చేరుకొంటారు. ఇటీవల
మట్టి పెళ్లలు విరిగిపడి సజీవ సమాధి అయిన కూలీల కుటుంబాల్ని ఆయన పరామర్శిస్తారు.
తర్వాత గుంటూరు నగరానికి చేరుకొని అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న
కూలీలను  పలకరిస్తారు.

 

Back to Top