వచ్చేనెల మొదట్లో ఉభయగోదావరి జిల్లాల పర్యటన

హైదరాబాద్) ఉభయ గోదావరి
జిల్లాల్లో ముఖ్యంగా పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ వచ్చే నెల మొదట్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది.
వాస్తవానికి విజయవాడ సమావేశం తర్వాత బుధవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో,
గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, కాపు నాయకుడు
ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా ఈ పర్యటనను వాయిదా వేసుకొన్నట్లు స్వయంగా వైయస్
జగన్ ప్రకటించారు. వచ్చే నెల మొదటివారంలో పర్యటిస్తానని ఆయన విజయవాడ సభ వేదిక
నుంచి ప్రకటించారు. దీంతో అప్పుడు పర్యటన కోసం పార్టీ శ్రేణులు సన్నాహాలు
చేస్తున్నారు. 

Back to Top