ఈనెల‌13న ఏజ‌న్సీలో ప‌ర్య‌ట‌న‌

హైద‌రాబాద్‌) ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైయస్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏజ‌న్సీలో ప‌ర్య‌టించ‌నున్నారు. పోల‌వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ప్ర‌జ‌ల సాధ‌క బాధ‌కాలు తెలుసుకోనున్నారు. 
ఈనెల 13న అంటే బుధ‌వారం ఉద‌యం ప‌ది గంట‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ రోడ్డు మార్గాన జంగారెడ్డి గూడెం చేరుకొంటారు. అక్క‌డ పొగాకు రైతుల‌తో ఆయ‌న స‌మావేశం అవుతారు అనంత‌ర ఆయ‌న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కుక్కునూరు మండ‌ల కేంద్రానికి వెళ‌తారు. అక్క‌డ గ్రామం అంత‌టా ప‌ర్య‌ట‌న సాగుతుంది. అక్క‌డ ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అవుతారు. అనంత‌రం సాయంత్రం 4 గంట‌ల‌కు వేలేరు లో ప‌ర్య‌టిస్తారు. అక్క‌డ ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి మాట్లాడ‌తారు. స‌మస్య‌ల‌పై స్థానికుల‌తో జ‌న నేత చ‌ర్చిస్తారు. అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ రాత్రికి భ‌ద్రాచ‌లం చేరుకొంటారు. 
Back to Top