ముంపు ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటన

()వర్షాలతో భారీ ఆస్తి, ప్రాణనష్టం
()బాధితులకు అండగా వైయస్ జగన్
()సోమ,మంగళవారాల్లో గుంటూరులో పర్యటన

హైదరాబాద్ః  ఏపీలో కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
ఈనేపథ్యంలో నష్టపోయిన బాధితులకు అండగా ఉండేందుకు వరద ముంపు ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటించనున్నారు.  గుంటూరు జిల్లాలో సోమ, మంగళవారాల్లో వైయస్ జగన్ పర్యటించనున్నారు. వరద కారణంగా పంటనష్టపోయిన రైతులతో పాటు ఇతర బాధితులను వైయస్ జగన్ పరామర్శిస్తారు. 

ఏపీలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అలమటిస్తున్న పరిస్థితి. వరదల కారణంగా భారీ ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్న దుస్థితి. 

పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే...ప్రభుత్వం చోద్యం చూస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు కనీస వసతులు కల్పించడంలోనూ,  సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రజల ఇబ్బందులపై అధికారులతో ముఖ్యమంత్రి కనీస సమీక్ష జరపకపోవడం, మంత్రులు మొద్దు నిద్రవహిస్తుండడం దారుణం. 
Back to Top