వైయస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించనున్న వైయస్ జగన్

వైయస్సార్ జిల్లా)మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రేపు ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ..పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపాలపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. ఆతర్వాత స్థానికంగా నిర్వహించనున్న గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైయస్సార్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. అదే సమయంలో టీడీపీ అవినీతి, మోసపూరిత పాలనను ఎండగట్టేందుకు రేపటి నుంచి గడపగడపలో వైయస్సార్ కాంగ్రెస్ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లనుంది. 
Back to Top