ఈ సారి తిరిగేది ఫ్యానే

అనంతపురం

: శింగనమల నియోజకవర్గంలో ఈ సారి ఈ సారి తిరిగేది ఫ్యానే అని జొన్నలగడ్డ పద్మావతి ధీమా వ్యక్తం చేశారు.  తరిమెల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంతవరకు అంతర్గత రోడ్లు లేవని జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే దళితులకు పక్కా ఇల్లు నిర్మిస్తారని తెలిపారు. తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తరిమెల గ్రామానికి రాగానే టీడీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నా..మమ్మల్ని ఆపడానికి పోలీసులను పంపించారని, అప్పుడు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అండగా నిలిచారని చెప్పారు. ఏమ్మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వినిపిస్తుందా? ఈ శింగనమల నియోజకవర్గం నుంచి మాట ఇస్తున్నాను. ఈ సారి తిరిగేది ఫ్యానే అని స్పష్టం చేశారు.

Back to Top