తంబళ్లపల్లెకు వైయస్‌ జగన్‌ ను ఆహ్వానిస్తాం

చిత్తూరు:  గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం పూర్తయ్యాక తంబళ్లపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షులు వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ.మిథున్‌రెడ్డి చెప్పారు. 

తొలి విడతలో నియోజకవర్గంలోని బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లె మండలాల్లో, రెండోవిడతలో ములకలచెరువు, కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో కార్యక్రమం పూర్తి చేసి బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వివరించారు. నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారనికి చర్యలు తీసుకొంటామని ఎంపీ పేర్కొన్నారు.
Back to Top