వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం

  • అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల‌ను కొనగలరేమో గానీ
  • వైయస్ జగన్ పై ఉన్న ప్రజల అభిమానాన్ని కొనలేరు
  • చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు
  • ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీ గెలుపు ఖాయం
  • వైయస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి, నారాయణస్వామి
తిరుపతిః చంద్ర‌బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌గ‌ల‌రేమో గానీ, ప్ర‌జాభిమానాన్ని మాత్రం కొన‌లేర‌ని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే డాక్ట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని పెద్దిరెడ్డి తెలిపారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు రైతుల‌కు, మ‌హిళ‌ల‌కు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగుల‌కు జీవ‌న‌భృతి ఇస్తామ‌న్న బాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలేశార‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నేర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. బాబు అవినీతి, అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. బాబు కేవ‌లం డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నారే త‌ప్ప ప్ర‌జ‌లు వైయస్ జ‌గ‌న్‌పై పెంచుకున్న అభిమానాన్ని కొనలేర‌ని సూచించారు. రాష్ట్రంలో ఏ క్ష‌ణంలో ఎన్నిక‌లు వ‌చ్చినా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తుందని, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. తిరుపతిలో 

టీడీపీ ప్ర‌లోభాల‌కు లొంగి పార్టీ ఫిరాయింపు
టీడీపీ ప్ర‌లోభాల‌కు లొంగి కొంత మంది పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి అన్నారు. జిల్లాలో వైయ‌స్సార్సీపీని ప‌టిష్ట ప‌రిచేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. 8వ తేదీ నుంచి చేప‌ట్ట‌నున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్సీపీ కార్య‌క్ర‌మాన్ని అన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌ద‌వులు ముఖ్యంకాద‌ని ప్ర‌జాసంక్షేమ‌మే త‌మ ల‌క్ష్యమ‌న్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top