19న పశ్చిమలో వైయస్ జగన్ పర్యటన

పశ్చిమ గోదావరిః

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈనెల 19న జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు.  భీమవరం మండలంలోని తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువుల్లో పర్యటించి మెగా ఆక్వాఫుడ్ బాధితులను పరామర్శిస్తారు.  జిల్లాలోని గ్రామాల్లో మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. కాగా, బాధిత గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఇప్పటికే పర్యటించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన  బృందం అక్కడి పరిస్ధితులను అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వివరించింది.

Back to Top