తవ్వకాలు ఆపకపోతే ఉద్యమిస్తాం

  • అధికార పార్టీ అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ రైతుల దీక్ష
  • గుంతల్లో పడి 12 మంది రైతుల మృత్యువాత
  • సుద్దపల్లిలో మూడు రోజులుగా రైతుల ఆందోళన
  • రైతుల పోరాటానికి వైయస్ జగన్ సంఘీభావం
  • ప్రభుత్వ తీరుపై ఆగ్రహం..తవ్వకాలు ఆపాలని హెచ్చరిక
గుంటూరు: అధికార పార్టీ అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన దీక్షకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో రైతులు మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. శుక్రవారం సుద్దపల్లికి చేరుకున్న వైయస్‌ జగన్‌..రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలోని చేరువులో టీడీపీ నేతలు దౌర్జన్యంగా మట్టి తవ్వుకోవడంతో తాగడానికి నీళ్లు లేవని, ఏడాదిగా పంటలకు కూడా నీరు అందడం లేదన్నారు. 

చెరువులోని గుంతల్లో పడి ఇప్పటికే 12 మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముగ్గురు పిల్లలు ఈ క్వారీలో పడి మృతి చెందినా అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ ఇవ్వకుండా, అక్రమంగా చెరువులు తొవ్వుకుంటున్న వారికి రక్షణ కల్పించారు. మాకు ప్రాణనష్టం జరిగిందని అడిగితే..డబ్బులు తీసుకున్నారు కదా అని  నిందిస్తున్నారని రైతులు వైయస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. రైతుల సమస్యలపై వైయస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం రైతు ప్రయోజనాలను పక్కనబెట్టి కొంత మందికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. చెరువులో తవ్వకాలు ఆపకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న పోరాటానికి వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
–––––––––––––
పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు: సుజాత
చెరువులో పూడిక తీయడం వల్ల పిల్లలు చచ్చిపోతున్నారు. చెరువులో గోతులు పెడతామంటున్నారు. మేం ఎక్కడికి వెళ్లాలి.  పంటలకు నీళ్లు అందడం లేదు. తాగడానికి నీళ్లు లేవు. చెరువులు తవ్వడం వల్ల నీళ్లు లోతుకు పోతున్నాయి. తూములకు నీళ్లు అందకపోవడంతో పంటలకు నీళ్లు రావడం లేదు. గోతిలో పడి 12 మంది మృతి చెందారు. పోలీసులను తీసుకొని వచ్చి దౌర్జన్యంగా చెరువులో పోక్లెయిన్లతో తవ్వుతున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top