వైయస్ జగన్ అప్పుడే హెచ్చరించారు

కర్నూలు: రాజకీయాల కోసం చంద్రబాబు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని  వైయస్సార్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన జరిగితే జల వివాదాలు వస్తాయని తమ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించినా.... ఎవరూ పట్టించుకోలేదని  అనంత వెంకట్రామిరెడ్డి  అన్నారు.  

స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  అనంత మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాలపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ నెల 16,17,18 తేదీల్లో కర్నూలు కేంద్రంగా దీక్ష చేపట్టనున్నారు. 

To read this article in English:  http://bit.ly/1OkHgaT

Back to Top