ప్రజా సంకల్పమే వైయస్‌ జగన్‌ను నడిపిస్తోంది

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్పమే వైయస్‌ జగన్‌ను నడిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైయస్‌ జగన్‌ను శిల్పా కలిశారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.  ఏపీలో కొత్తగా తెలుగు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడబోతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. మండుటెండల్లో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ శ్రమ ఫలిస్తుందని, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పమే వైయస్‌ జగన్‌ను నడిపిస్తుందన్నారు. ఉభయ డెల్టా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైయస్‌ఆర్‌సీపీ స్వీప్‌ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమని తేల్చి చెప్పారు.
Back to Top