వైఎస్ జగన్ వ్యక్తి కాదు శక్తి...!

చంద్రబాబు దుష్టపాలనపై జ్యోతుల ఫైర్..!

గుంటూరుః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారని నెహ్రూ మండిపడ్డారు. రాష్ట్రం దుర్భిక్షంలో ఉంటేనే తన దుష్టపన్నాగాలు అమలవుతాయని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకున్న సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు.  రైతుల దుస్థితిని ఆయుధంగా వాడుకుని, వారికి భ్రమలు కల్పించి చంద్రబాబునాయుడు మోసం చేశారని చెప్పారు.

యువతకు ఉద్యోగాలిస్తామని.. నిరుద్యోగ ఉదృతి భృతి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి దగా చేశారన్నారు. ప్రత్యేక హోదా పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని, అది తెచ్చి ఎవరికి పెడతారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని, తనకు ఎక్కడ లంఛాలు రావో అని పోలవరం పక్కకు పెట్టేశారని, దానిని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని అంటున్నారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసుల కుంభకోణంలో ఇరుక్కుని చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. 

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం లేకుంటే పోలవరం పూర్తి కాదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. పోలవరం కాలువ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్విస్తే ...తానేదో గొప్పలు సాధించినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నాడని ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. వైఎస్ జగన్ దీక్షపై చంద్రబాబు మాట్లాడుతున్న తీరు అహంకారపూరితమన్నారు. ఆనాడు పదిహేను సంవత్సరాలు హోదా కావాలని అడిగన చంద్రబాబు..ఈరోజు ప్యాకేజీ పేరుతో మభ్యపెడుతూ వైఎస్ జగన్ ఏంఅవసరం వచ్చిందని దీక్ష చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఓ వ్యక్తి కాదు శక్తి అని ..మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరంగా ఇచ్చిన శక్తి అని నెహ్రూ అన్నారు. వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుందని, అయినా దీక్ష కొనసాగించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. 
Back to Top