ప్రభుత్వం చెప్పిందేమిటి....చేస్తున్నదేంటి' .

ప్రభుత్వం చెబుతున్నదేంటి.. చేస్తున్నదేంటని ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మండిపడ్డారు. విశాఖపట్నంలోని పాయకరావుపేట చేరుకొని గోకులపాడు బాణసంచా పేలుళ్ల ఘటనలో మృతిచెందిన భూపతి సత్యనారాయణ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.


ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని స్వయంగా కార్మికశాఖ మంత్రే తెలిపారని, కానీ  రూ.2 లక్షలు ఇవ్వడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనను జిల్లా కలెక్టర్ కి అందజేస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రమణ, భూపతి లోవరాజు, కేదారి దుర్గ, లింగంలపల్లి శేషమ్మ, నూతి సత్యవతి కుటుంబాలను కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. పేలుళ్ల తర్వాత క్షతగాత్రులు, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటోందన్న విషయాలను కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కుటుంబాలు ఎలా గడుస్తున్నాయన్న విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.

Back to Top