శారదాపీఠాన్ని సందర్శించిన వైఎస్ జగన్


విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గం చినముషిడివాడలోని శారదా పీఠాన్ని వైఎస్ జగన్
సాయంత్రం 5 గంటలకు సందర్శించారు. పీఠం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు
ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు . అనంతరం జగన్ నేరుగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలుసుకొని ఆయన ఆశీర్వాదం పొందారు. క్షణం తీరిక లేకుండా సాగిన సుడిగాలి పర్యటనను ముగించుకొని జగన్ సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.
Back to Top