ప్రశ్నించకుంటే పోలవరం పూర్తైపోయిందంటాడేమో!

పోలవరం: 'ప్రాజెక్టుల బాట'లో భాగంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. నిర్మాణం పనులపై అధికారులను ప్రశ్నించారు. గడిచిన 11 నెలల కాలంలో కేవలం రూ.100 కోట్ల రూపాయల విలువైన పనులు మాత్రమే జరిగాయని అధికారులు వైఎస్ జగన్ కు వివరించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజి లోకి నెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని,  కాసుల కోసం పట్టిసీమ ప్రాజెక్టును మాత్రం పరుగెత్తిస్తోందని విమర్శించారు. 'మ్యానిఫెస్టోలో మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న బాబు.. ఆ మధ్య నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇప్పుడేమో ఐదేళ్లని అంటున్నారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తారా లేదా' అని వైఎస్ జగన్ మండిపడ్డారు. దీంతో పక్కనే ఉన్న కొందరు.. 'ఐదేళ్లు కాదు సార్.. మీరు ప్రశ్నించకుంటే బాబుగారు పోలవరం పూర్తయిందని ప్రకటించేవారే' అనడంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్, అధికారుల మధ్యజరిగిన సంవాదం ఇది..
వైఎస్ జగన్: పనులు ఎలా జరుగుతున్నాయ్?
అధికారులు: ఫర్వాలేదు సార్.. బాగానే నడుస్తున్నాయి.

వైఎస్ జగన్: పని ఏమేరకు పూర్తయింది?
అధికారులు: గడిచిన 11 నెలల్లో రూ.100 కోట్లతో దాదాపు కోటిన్నర క్యూబిక్ మీటర్ల నిర్మాణం జరిగింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం మరో 100 కోట్లు వెచ్చించాం.

వైఎస్ జగన్: అదేంటి? 16 వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టులో  సంవత్సరానికి కనీసం 4 వేల కోట్ల రూపాయల పని పూర్తికావాలికదా!
అధికారులు: మీరన్నది నిజమేసార్.. కానీ ఆర్ ఆర్ ప్యాకేజీపై స్పష్టత రాలేనందున జాప్యం జరుగుతోంది!

వైఎస్ జగన్: అదేంటి? పట్టిసీమ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రెండు రోజుల్లో ప్రకటించారు. మరి పోలవరం విషయంలో మాత్రం ఇంత దారుణమా?
Back to Top