రైతులకు అండగా మచిలీపట్నంలో వైఎస్ జగన్ పర్యటన

మచిలీపట్నం: ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భూసేకరణ బాధితులతో భేటీ అయి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అనుబంధ పరిశ్రమల పేరుతో రైతుల భూములు లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జగన్ తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారంలో రైతులతో సమావేశమైన వైఎస్ జగన్ అక్కడ పరిస్థితిని  సమీక్షించారు.  

బలవంతంగా భూములు తీసుకున్నారో..!
కేంద్రప్రభుత్వమే భూఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకుందని..రైతుల ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకోలేరని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
పోర్టు భూములకు పరిహారం ఎంతిస్తారో ప్రభుత్వమే చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

మక్కామృతుల కుటుంబాలకు పరామర్శ..!
అంతకుముందు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం చేరుకున్న వైఎస్ జగన్ కు ..పార్టీనేతలు ఘనస్వాగతం పలికారు. పట్టణంలో వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ ఇంగ్లీషుపాలెంకు బయలుదేరారు. మక్కాలో మృతిచెందిన అబ్దుల్ ఖాదర్, ఫాతిమా కుటుంబాలను పరామర్శించారు. హజ్ యాత్ర మృతులను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒక్కొక్కరికి రూ. 8లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  
Back to Top