లాక్కున్న భూములన్నీ వెనక్కి...

గుంటూరు: అవసరం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా సేకరించిన భూములన్నిటినీ తాను అధికారంలోకి రాగానే తిరిగి ఆయా రైతులకు ఇప్పిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంత గ్రామాలలో ఆయన మంగళవారం పర్యటించారు. రైతులు, రైతు కూలీలు, రైతు మహిళలతో మాట్లాడారు. ఉండవల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి సమీపంలోనే వినుకొండలో 18 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అక్కడ భూమిని సేకరిస్తామంటే ఏ రైతూ అభ్యంతరం చెప్పరు. అలాంటి చోటును వదిలేసి ఏడాదికి మూడు పంటలు పండే బంగారం లాంటి భూమిని బలవంతంగా లాక్కుని సింగపూర్ సిటీ కడతాననడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నా. రైతులు, రైతు కూలీలు, మహిళల దగ్గర నుంచి ఏం జరిగిందో అన్ని విషయాలనూ తెలుసుకున్నాం. అందరి బాధలూ విన్నాం. భూములు తీసుకుంటే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదని చంద్రబాబుకు తెలియడం లేదు. మళ్లీ మళ్లీ ఒక్క విషయం చెబుతున్నా. చంద్రబాబు నాయుడు బలవంతంగా ఏ ఒక్కరి నుంచి భూములు తీసుకున్నా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిరైతుకూ ప్రతి ఎకరా భూమినీ తిరిగి ఇస్తానని చెబుతున్నా. అందరం కలసికట్టుగా చంద్రబాబు మెడలు వంచైనా సరే పోరాటం చేద్దాం. మనసులో కొండంత బాధ ఉన్నా.. చిరునవ్వుతో ఇక్కడికొచ్చి పలకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.’’ అని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top