గుంటూరు) ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ప్రోగ్రామ్ ల సమన్వయకర్త, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. సాయంత్రం నాలుగున్నరకు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి విజయవాడ శివారు గన్నవరం కు విమానంలో వస్తారు. అక్కడ నుంచి రోడ్ మార్గంలో గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు వెళతారు. అక్కడ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గం పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ వివాహ వేడుకలు హాజరవుతారు. అక్కడ వధూవరుల్ని ఆశీర్వదించి వెనక్కి ప్రయాణం అవుతారని రఘురామ్ వివరించారు.