విశాఖ బయలు దేరిన వైఎస్ జగన్

హైదరాబాద్) ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ విశాఖపట్నం బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం
నుంచి విమానంలో విశాఖ వెళుతున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా వైఎస్సార్సీపీ విశాఖ
జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఇంటికి వెళతారు. అక్కడ ముఖ్యనేతలతో
సంభాషిస్తారు. అనంతరం అచ్యుతాపురం ఎస్ ఈ జడ్ ప్రాంతానికి వెళతారు. బ్రాండెక్స్
కర్మాగారం కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలుపుతారు. జంగులూరు జంక్షన్ ప్రాంతంలో
ఇందు కోసం ఏర్పాట్లు చేశారు. ఎలమంచిలి నియోజక వర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వర రావు
ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

Back to Top