హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఎల్లుండి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ కస్తూర్బా గార్డెన్స్ లో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పర్యటన వివరాల్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.