వై ఎస్ జగన్ కు సాగర్ దగ్గర అభిమానుల స్వాగతం

గుంటూరు) ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు జిల్లా లోని నాగార్జున సాగర్
ప్రాజెక్టు పరిస్థితుల్ని గమనించారు. క్రిష్ణా నది మీద ఉన్న ప్రధాన బహుళార్థ సాధక
ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో నీరు అడుగంటింది. ఎగువ ప్రాంతాల్లోని
ఎత్తిపోతల పథకాలు, నీటి విడుదల కు సంబంధించిన అంశాల మీద చంద్రబాబు ప్రభుత్వం
పట్టించుకోక పోవటంతో దిగువ ప్రాంతాలకు గొంతెండుతోంది. దీంతో నాగార్జున సాగర్ లో
పరిస్థితిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కాన్వాయ్ లో వెళుతూ పరిశీలించారు. అక్కడ ఉన్న అభిమానులు, కార్యకర్తల్ని పలకరించారు. అనంతరం మాచర్లకు బయలు దేరారు. 

Back to Top