పార్టీ నేత‌కు ప‌రామ‌ర్శ‌

అనారోగ్యంతో బాధపడుతున్న‌ తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజును ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్ర‌స్తుతం ఆయ‌న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాలపాటు కృష్ణంరాజుతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆ సమయంలో కృష్ణంరాజు భార్య మల్లేశ్వరి, చిన్నకుమార్తె కృష్ణకుమారి, కుమారుడు శ్రీనివాసరాజు అక్కడే ఉన్నారు. కృష్ణంరాజుకు నిమ్స్ కార్డియాలజీ వైద్యులు శేషగిరిరావు, చెస్ట్ డాక్టర్ పరంజ్యోతి, డాక్టర్ జీఎస్‌ఎన్ రాజులు వైద్యమందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ తో పాటు తూర్పుగోదావ‌రి జిల్లా నేత‌లు చ‌ల‌మ‌శెట్టి సునీల్‌, చెల్లుబోయిన వేణు ఉన్నారు. 
Back to Top