బాధిత మత్స్యకారులను పరామర్శించిన వైయస్ జగన్

విశాఖపట్నం: ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన పాల్మన్ పేట మత్స్యకారులను వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.  విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఉన్న వైయస్ జగన్.. పాల్మన్ పేటకు వెళ్లి మత్స్యకారులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు తమపై దాడికి పాల్పడిన ఘటన గురించి మత్స్యకారులు వైఎస్ జగన్ కు వివరించారు. టీడీపీలో చేరనందుకే తమపై దాడి చేశారని చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top