చలపతి కటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్

వైయస్సార్ జిల్లా(పులివెందుల): ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ జిల్లాలో బిజిబజీగా గడుపుతున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూడవ రోజు పర్యటనలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభించారు. లింగాల మండలం పెద్దకూడాలలో రైతు చలపతి కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించారు. ఓవైపు పంటనష్టం, మరోవైపు, ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాత చలపతి..బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక  2015 సెప్టెంబర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనేపథ్యంలో వైయస్ జగన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చారు. అండగా ఉంటానని, అధైర్య పడొద్దని వారిలో ధైర్యం నింపారు.

Back to Top