డిసెంబర్ 2న విశాఖ ఏజెన్సీకి వైఎస్ జగన్

                                                       గిరిజన హక్కుల కమిటీ
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ప్రధాన ప్రతిపక్ష నేతగా తీవ్రంగా వ్యతిరేకించిన  చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తవ్వకాలకు అనుమతించి దాదాపు 3000 ఎకరాలు కట్టబెట్టడం మీద మన్యం అంతా భగ్గుమంటుంది. ఈనేపథ్యంలో గిరిజనుల న్యాయమైన అభిప్రాయాలను, వారి అనుభవాలను, డిమాండ్లను పరిగణలోకి తీసుకునేందుకు, బాక్సైట్ తవ్వకాలను నిరోధించేందుకు అధ్యక్షుడు శ్రీ.వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గిరిజన హక్కుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

సభ్యులుః
1. శ్రీమతి గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే
2. శ్రీ కె. సర్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే
3.శ్రీ కె.రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే
4. శ్రీమతి పి. పుష్పశ్రీవాణి, కురుపాం ఎమ్మెల్యే
5. శ్రీమతి వి.కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
6. శ్రీమతి వంతల రాజేశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే
7. శ్రీ తెల్లం బాలరాజు, ఎస్.టి.సెల్ రాష్ట్ర అధ్యక్షులు
8. శ్రీ గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు
9. శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి ఎమ్మెల్యే&ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ జనరల్ సెక్రటరీ
10.శ్రీ ధర్మాన ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు
11.శ్రీ వి. విజయసాయిరెడ్డి, విశాఖ జిల్లా పార్టీ పరిశీలకులు

"బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల హక్కులు" అనే అంశంపై డిసెంబర్ 2న పాడేరు వేదికగా జరిగే కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు.
Back to Top