బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

విజయవాడ: కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పరామర్శించారు.  విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
 
అంతకు ముందు మార్చురీలో ఉన్న మృతదేహాలకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్ ఖాన్, పార్టీ నేతలు పార్థసారథి,  వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, గౌతంరెడ్డి తదితరులు ఉన్నారు. కృష్ణలంకలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి అయిదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Back to Top