ఎస్వీ విద్యార్థులతో వైఎస్ జగన్ భేటీ..!

తిరుపతిః ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్షనేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దీనిలో భాగంగానే స్పెషల్ స్టేటస్ పై ఎస్వీ విద్యార్థులతో ముచ్చటించేందుకు జగన్ మంగళవారం తిరుపతి వెళ్తున్నారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని పీఎల్ ఆర్  కన్వెన్షన్ హాల్ లో...రేపు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అవుతారు. ఏపీకి ప్రత్యేకహోదా, రాష్ట్రాభివృద్ధిపై విద్యార్ధులతో చర్చిస్తారు. తొలుత ఎస్వీ యూనివర్సిటీలోనే సమావేశం నిర్వహించాలని భావించగా..అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్లేస్ మార్చారు.

సమావేశం అనంతరం వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. తనపల్లి ప్రాంతంలోని పీఎల్ఆర్ గార్డెన్స్ లో ఈసదస్సు జరుగుతుంది. 
Back to Top