కాకినాడకు బయలుదేరిన వైఎస్ జగన్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడకు బయలుదేరారు. మధ్యాహ్నం హైదరాబాద్ విమానాశ్రయంకి చేరుకొని అక్కడి నుండి విమానంలో బయల్దేరి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి కాకినాడకు వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం రాజమండ్రికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Back to Top