ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

విజయవాడ: ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పర్యటించనున్నారు. వరదల్లో దెబ్బతిన్న పంట పొలాల్ని ఆయన పరిశీలించనున్నారు.
ఈ మేరకు ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ ఖరారైందని పోగ్రామ్స్ కన్వీనర్ తలశిల
రఘురామ్ వెల్లడించారు.
శుక్రవారం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్
నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా కు రానున్నారు. తణుకు పరిసర ప్రాంతాల్లో
వైఎస్ జగన్ పర్యటిస్తారు. వానలు విస్తారంగా కురిసిన తర్వాత పంట పొలాల్లో
నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. పంట పొలాల నుంచి నీరు దిగువ ప్రాంతాలకు
వెళ్లటం లేదు.   నీటి పారుదల వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోతుండటంతో, చాలా
కాలం నుంచి పట్టించుకోవటం లేదు. దీంతో వానల రూపంలో ప్రక్రతి బీభత్సం కంటే,
మానవ నిర్లక్ష్యం తో జరుగుతున్న అనర్థమే ఎక్కువగా ఉంటోంది. పంట నానిపోయి,
సరైన మద్దతు ధర లభించక అల్లాడిపోతున్న రైతాంగాన్ని జన నేత జగన్
పలకరించనున్నారు.
ఆ తర్వాత వైెఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాకు
వెళ్లనున్నారు. అక్కడ కొత్త పేట నియోజక వర్గంలోని ఈతకోట, పరిసర ప్రాంతాల్లో
పర్యటించనున్నారు. లంక గ్రామాల్లో దెబ్బతిన్న తోటల్ని పరిశీలించి, అక్కడ
రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. 
Back to Top