బాధితులకు బాసటగా..

  • దళితులపై వివక్ష..మణ్యంలో మరణమృదంగం
  • చంద్రబాబు సర్కార్ దాష్టీక పాలనకు నిదర్శనం
  • 30,1తేదీల్లో గోదావరి జిల్లాల్లో వైయస్‌ జగన్‌ పర్యటన
  • గరగపర్రులో బహిష్కరణకు గురైన దళితులకు బాసట
  • విషజ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో విషణ్ణవదనంతో పర్యటన
వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గోదావరి జిల్లాల్లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.  విషజ్వరాలు ప్రబలిన గిరిజన ప్రాంతాల్లో, దళితులు సామాజిక బహ్కిరణకు గురైన గరగపర్రులో జూన్‌ 30, జులై 1వ తేదీల్లో పర్యటిస్తారు. ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో పర్యటించి అక్కడ సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శిస్తారు.  వారిలో మనోధైర్యాన్ని కల్పిస్తారు. జూలై 1న తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలో విషజర్వాలు ప్రబలిన ప్రాంతాలలో జగన్‌ పర్యటిస్తారు. వ్యాధి బారిన పడిన గిరిజనులతో ఆయన సమావేశమవుతారు. పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం తీరును ఎండగట్టనున్నారు. 

రాష్ట్రంలో దళితులు, గిరిజనులు అన్ని వర్గాలపైన  ప్రభుత్వం వివక్ష చూపుతోంది. గోదావరి జిల్లాల్లో ఉద్రిక్తతలను పెంచి పోషిస్తోంది. కులాల మధ్య చిచ్చుపెడుతూ చాలి కాచుకుంటోంది. బాబు పాలనలో దళితుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే... మనం ఏ యుగంలో ఉన్నామో అర్థం కాని రీతిలో సాంఘీక బహిష్కరణకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పక్షాన పోరాడే జననేత వైయస్ జగన్ కోసం దళిత సోదరులు ఎదురుచూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా  గరగపర్రులో బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి వారికి తోడుగా నిలిచేందుకు వైయస్ జగన్ ఈనెల 30న అక్కడ పర్యటిస్తున్నారు. 

-పనులకు పిలవడం లేదు..సరుకులు ఇవ్వడం లేదు
- మా ఊరికి ఆర్‌ఎంపీ డాక్టర్‌ను కూడా రానివ్వటంలేదు 
- ప్రతిపక్ష నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన దళితులు
- 30న గరగపర్రుకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌

దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన గరగపర్రు గ్రామంలో మంగళవారం వైయస్సార్‌సీపీ నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. దళితపేట చర్చిలో బాధితులతో సమావేశమై వారికి జరిగిన అన్యాయాలను అడిగి తెలుసుకుంది. అంబేడ్కర్‌ విగ్రహం వివాదం నేపథ్యంలో రెండు నెలల నుంచి అగ్రవర్ణాలు కౌలుకిచ్చిన భూములు వెనక్కి లాక్కోవడమే కాకుండా, పనులకు పిలవడం లేదని బాధితులు వైయస్సార్‌సీపీ బృందానికి వివరించారు. ఇంట్లో పనిచేసేవారిని కూడా బహిష్కరించారని, తమతో మాట్లాడితే జరిమానాలు విధిస్తామని హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యం చేసే ఆర్‌ఎంపీ డాక్టర్‌నూ రానివ్వడం లేదని, దుకాణాల వద్ద సరుకులు ఇవ్వడం లేదని, పశువులను మేపడానికీ అనుమతించడం లేదన్నారు. బాధితులతో సమావేశం అనంతరం వైయస్సార్‌ సీపీ కమీటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో దళితులను అణగదొక్కుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రెండు నెలలుగా మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన బలరామకృష్ణంరాజుతో సహా నిందితులను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. గరగపర్రులో సంఘటనలు, బాధితుల ఇబ్బందులను పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్న వైయస్ జగన్ దళితుల్లో ధైర్యం నింపేందుకు స్థానిక పర్యటనకు సిద్ధమయ్యారు. 
 
ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం
మణ్యంలో మరణమృదంగం
బాధిత కుటుంబాల చెంతకు వైయస్ జగన్
జూలై 1న ఏజెన్సీలో పర్యటన

ఇక తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో విషజ్వరాలతో మరణమృదంగం మోగుతోంది. ప్రజారోగ్యం పట్టని బాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరి కారణంగా పేదల ప్రాణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడ ప్రభుత్వంలో కనీస చలనం లేదు.  పేదల ఆరగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వారిని అవహేళన చేస్తోంది. కొండల్లో ఉండే కొద్దిమంది కోసం నీళ్లు, రోడ్లు, విద్యుత్ ఏదీ ఇవ్వలేమంటూ హేళన చేస్తోంది. ఓట్ల కోసం కొండలు సైతం పిండి చేసేలా ఎక్కిన తమ్ముళ్లకు ...గిరిజనుల ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి మాత్రం మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు చేష్టలూడిగాయి.  ఈ నేపథ్యంలో  ఎక్కడ ఎవరికి ఏ ఆపద వాటిల్లినా నేనున్నాంటూ అండగా నిలిచే వైయస్ జగన్ కోసం ఏజెన్సీ అంతా ఎదురుచూస్తోంది. కన్నీటి పర్యంతమవుతున్న గిరిపుత్రలకు తోడుగా నిలిచేందుకు వైయస్ జగన్ ఈనెల 1న తూర్పుగోదావరి జిల్లా చాపరాయి, ఇతర గ్రామాల్లో పర్యటించబోతున్నారు. ఈ నెల 30వ తేదీ రాత్రికి వైయస్ జగన్ జిల్లాకు చేరుకుంటారని, జూలై 1వ తేదీన విష జ్వరాలతో అల్లాడుతున్న గ్రామాలను సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు  తెలిపారు. 
Back to Top