గరగపర్రు చేరుకున్న వైయస్ జగన్

విజయవాడ: వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గరగపర్రుకు చేరుకున్నారు. అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం చేరుకున్న వైయస్ జగన్ కు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి గూడెం, పిప్పర మీదుగా వైయస్ జగన్ గరగపర్రు చేరుకున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైయస్‌  జగన్‌ పరామర్శిస్తారు. వైయస్ జగన్‌కు స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్యే కొడాలి నాని, రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్టీ నేతలు వంగవీటి రాధ, మేరుగ నాగార్జున, ప్రసాద్‌రాజు, గ్రంధి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొప్పన భవకుమార్‌, ఖాజా రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Back to Top