గుంటూరులో వరద ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటన

హైదరాబాద్ః వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు, రేపు గుంటూరులో వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు.  జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను, సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. వారి ఇబ్బందులను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దష్టికి తెచ్చి,  ఆసరాగా నిలవనున్నారు.

Back to Top