నెల్లూరు,వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన

వరద బాధితులకు పరామర్శ
23,24న రెండ్రోజుల పాటు పర్యటన..

ఏపీలో
భారీ వర్షాలతో నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం
పూర్తిగా స్తంభించింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటికీ
అనేక ప్రాంతాలు జలదిగ్భందంలోనే చిక్కుకున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే
పరిస్థితి నెలకొంది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం మొద్దు నిద్ర
వహిస్తోంది. కుండపోత వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతన్న
బోరున విలపిస్తున్నా...ప్రభుత్వం వారిని పరామర్శించి ఆదుకున్న పాపాన పోవడం
లేదు. 

బాధితులను పరామర్శించి, వారి కుటుంబాల్లో
భరోసా నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ...సోమ,
మంగళవారాల్లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. నేరుగా ఆయా ప్రాంతాలకు
వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కృషిచేస్తారు. 23,24 తేదీల్లో
రెండ్రోజుల పాటు వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. 

ఇప్పటికే
వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలు..వరద ప్రభావిత ప్రాంతాల్లో
విస్తృతంగా పర్యటిస్తున్నారు. సహాయ, పునరావాస  కార్యక్రమాల్లో చురుగ్గా
పాల్గొంటున్నారు. ఆహారపదార్థాలు, సరుకులు పంపిణీ చేస్తూ స్థానిక ప్రజలను
ఆదుకుంటున్నారు. దెబ్బతిన్న పంటలకు  పెద్ద మొత్తంలో నష్టపరిహారం
చెల్లించడంతో పాటు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారందరినీ ఆదుకోవాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 
Back to Top