డిసెంబర్ 10న చింతపల్లికి వైఎస్ జగన్

విశాఖపట్నంః
 ఓ పక్క గిరిజనుల మనోభవాలు దెబ్బతీయమని చెబుతూనే .. చంద్రబాబు పోలీసులతో
ఆదివాసీల సమావేశాలను అడ్డగించే కుట్ర చేస్తున్నాడని వైఎస్సార్సీపీ పాడేరు
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. గిరిజనులు భయాందోళనకు
గురవుతున్నారని, జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే
రోజుల్లో టీడీపీ, బీజేపీలులు సర్వనాశనం అవ్వడం ఖాయమన్నారు. 

రాష్ట్రంలో
ఎక్కడ సమస్యలున్నా నేన్నానంటూ వెళ్లి ప్రజలకు అండగా నిలిచే ప్రతిపక్ష నేత,
తమ అధ్యక్షులు వైఎస్ జగన్ డిసెంబర్ 10న చింతపల్లి పర్యటనకు వస్తారని
ఈశ్వరి ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీనే రావాల్సి ఉండగా..మావోయిస్ట్
వారోత్సవాలున్న దృష్ట్యా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.  కొత్తపల్లి గీత,
శోభా హైమావతి, స్వాతి రాణిని విభజించు పాలించు పద్దతిలో టీడీపీ మనుషులుగా
పెట్టుకొని..గిరిజనుల హక్కులు కాలరాసేందుకు చంద్రబాబు కుట్రలు
పన్నుతున్నాడని ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో రద్దు చేసేవరకు
వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. 
Back to Top