మీ పోరాటం స్ఫూర్తిదాయకంగుంటూరు: రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఐదు రోజులుగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆమరణ దీక్షలు చేస్తున్న ఎంపీలను వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగడాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు.  మీ వెంటే వైయస్‌ఆర్‌సీపీ ఉందన్నారు. మీ దీక్షకు రాష్ట్రప్రజలు సంఘీభావం తెలుపుతున్నారన్నారు. మీ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, ఈ రోజు జాతీయ రహదారుల దిగ్భందం చేశారని, రేపు రైల్‌ రోకోలు నిర్వహిస్తున్నారన్నారు. అందుకు ప్రతిగా స్పందించిన ఎంపీలు  ఏడేళ్లుగా మీరు ప్రజల కోసం ఎంత  శ్రమించారో,  ఎన్ని నిరాహార దీక్షలు చేశారో, ఆ కష్టం ఇప్పుడు మాకు అర్థమైందన్నారు.  మీరే మాకు స్ఫూర్తి అని ఎంపీలు మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డిలు పేర్కొన్నారు.  
 
Back to Top