వైయస్ జగన్ రెండ్రోజుల పర్యటన

2న మహానేత వర్థంతి కార్యక్రమానికి హాజరు
వైయస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
అదే రోజు పలు కార్యక్రమాలకు హాజరు..పంటల పరిశీలన
3న కలెక్టరేట్ వద్ద రైతు మహాధర్నాలో పాల్గొననున్న జననేత

పులివెందుల : ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రేపటి నుంచి రెండ్రోజుల పాటు వైయస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 7వ వర్థంతి సందర్భంగా రెండో తేదీన ఇడుపులపాయలోని వైయస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలసి వైయస్ జగన్  ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ప్రియతమ నేత వైయస్ఆర్ కు నివాళులర్పిస్తారు.  మూడో తేదీన కడప కలెక్టరేట్‌ ఎదుట జరిగే రైతు మహాధర్నాలో పాల్గొంటారు. ఇంకా పలు కార్యక్రమాల్లోనూ వైయస్‌ జగన్‌ పాల్గొననున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

వైయస్ జగన్ పర్యటన షెడ్యూల్
గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి బయల్దేరి రాత్రికి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. 2వ తేదీ శుక్రవారం ఉదయం 7.30కు తన తండ్రి, దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైయస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు గెస్ట్‌హౌస్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం వేంపల్లెకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ్నుంచీ పులివెందులకు చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక రిలయన్స్‌ పెట్రోలుబంక్‌ నుంచి బెస్తవారిపల్లె వరకు పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. 3గంటలకు పులివెందుల మండలం ఎర్రిపల్లె సమీపంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలిస్తారు. 3.30కు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి వద్ద నూతనంగా నిర్మించిన ఆర్‌వో ప్లాంటును ప్రారంభిస్తారు. 4.30కు కడప రోడ్డులో గల తన చిన్నాన్న వైయస్‌ జోసఫ్‌రెడ్డి ఇంటిని సందర్శిస్తారు. 
 
3వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి కడపకు రోడ్డుమార్గాన వెళ్లి... 10.30 గంటలకు నూతన కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగే రైతు మహాధర్నాలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు లింగాల మండలం ఇంటిఓబాయపల్లెలోని ఎంపీటీసీ రమణ ఇంటికి చేరుకుని ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7గంటలకు పులివెందులలోని టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుని పెద్దజూటూరు పార్టీ నాయకుడు రామచంద్రారెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రి 9గంటలకు ముద్దనూరుకు చేరుకొని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళతారు.

తాజా వీడియోలు

Back to Top