మోదీ గారు మీరు చేసిన ప్ర‌మాణాన్ని నిల‌బెట్టుకోండి గుంటూరు :. ప్రధాని   న‌రేంద్ర మోదీ గారు, ఎంపీల జీవితాలు, ఏపీ భవిష్యత్‌ ఆందోళనలో ఉన్నాయి. హోదాపై మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి.’ అని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రత్యేక హోదా దీక్షపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం ట్వీట్‌ చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించారని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఉక్కు సంకల్పంతో ఈ నెల 6వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో  వైద్యుల సూచన మేరకు పోలీసులు వారిని  రామ్‌మనోహర్‌లోహియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైయ‌స్‌ అవినాశ్‌ రెడ్డి దీక్ష కొన‌సాగిస్తున్నారు.
Back to Top