‘ధర్మ పోరాటం’ సభ నిర్వహించడానికి బాబుకు అర్హత లేదు

 

కృష్ణా జిల్లా: నమ్మక ద్రోహం, వంచన చేసిన చంద్రబాబుకు తిరుపతిలో ‘ధర్మ పోరాటం’ సభ నిర్వహించడానికి అర్హత ఎక్కడుంది  అని ట్వీటర్లో వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని నరేంద్రమోదీ, చంద్రబాబు కలసే ఇచ్చారని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్‌ ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట సభపై స్పందించారు. ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఏప్రిల్‌ 30, 2014న తిరుపతిలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, వారి మిత్రులు కలసి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా 15 ఏళ్ల పాటు కావాలన్నారు. నాలుగేళ్లుగా హోదా అంశానికి అన్ని విధాలుగా ఆయన పాతరేశారు. ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ, ప్రజల నుంచి తప్పించు కునేందుకు కొత్త డ్రామాలకు తెరతీశారు. వంచనకు గుర్తుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైజాగ్‌లో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షకు ప్రజల నుంచి అద్భు తమైన స్పందన వచ్చింద‌ని తెలిపారు.

Back to Top