ప్ర‌జ‌ల ముఖాల్లో చిరున‌వ్వులు చూడ‌ట‌మే నా సంక‌ల్పం

తూర్పు గోదావ‌రి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి (రాజ‌న్న‌) రాజ్యాన్ని మ‌ళ్లీ తెచ్చి ప్ర‌జ‌ల ముఖాల్లో చిరున‌వ్వులు చూడ‌ట‌మే నా సంక‌ల్ప‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 200వ రోజుకు చేరుకున్న సంద‌ర్భంగా జ‌న‌నేత త‌న అనుభ‌వాల‌ను ట్వీట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. రాబోయే రోజుల్లో రేప‌టి ఆశ‌ల‌ను చూశాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  తూర్పు గోదావ‌రి జిల్లా  అమ‌లాపురం నుంచి బుధ‌వారం వైయ‌స్ జ‌గ‌న్ త‌న 200వ రోజు పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. వేలాది మంది జ‌న‌నేత వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు
Back to Top