హోదా విషయంలో ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు

ప్ర‌కాశం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో 2016 సెప్టెంబర్‌ నుండి కేంద్ర ప్రభుత్వం వైఖరి ఒకే విధంగా ఉందని తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ వచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  ట్వీట్‌ చేశారు.
ఊహాత్మకమైన, లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను పణంగా పెట్టారని పేర్కొన్నారు. ఇంతకాలం ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ వచ్చిన బాబు ఇప్పుడు హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఒక్కసారిగా మేల్కొనడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదని కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన కొత్త ఎత్తుగడలను ప్రారంభించారన్నారు. 

Back to Top