కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెడుతామని ఎన్‌టీఆర్‌ జన్మస్థలం నిమ్మకూరులో వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎన్‌టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్‌టీఆర్‌కు నివాళులర్పిస్తూ కృష్ణా జిల్లా పేరును నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తానని వైయస్‌ జగన్‌ ప్రమాణం చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top