ప్రధాని గారు మాట నిలబెట్టుకోండి

 
గుంటూరు:  ప్రత్యేక హోదా ఉద్యమంపై ప్రధానిని ఉద్దేశిస్తూ వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రధాని గారు మీరు ఒక రోజు ఉపవాస దీక్ష చేశారు...కానీ మా ఎంపీలు హోదా కోసం ఆరు రోజులు దీక్ష చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ  హస్తిన వేదికగా ఉద్యమించారని తెలిపారు. ప్రత్యేక హోదా కావాలన్న ఐదు కోట్ల ఆంధ్రుల మాట వినాలని కోరారు.  ఇప్పటికైనా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.
 
Back to Top