రాజన్న రాజ్యం నెలకొల్పుతాం


ప్రకాశం: రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకువస్తామని, రాజన్న రాజ్యాన్ని నెలకొల్పుతామని ౖÐð యస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను 8 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రారంభించామన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల ఆధారంగా పార్టీ ప్రారంభించామని చెప్పారు. ఏపీ హక్కులు కాపాడేందుకు కట్టుబడి ఉంటామని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైయస్‌ జగన్‌ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
 
Back to Top