దాసరికి వైయస్ జగన్ నివాళి

హైదరాబాద్‌: దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావుకు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ ఇమేజ్ గార్డెన్ లో జరిగిన దాసరి నారాయణరావు సంస్మరణ సభకు వైయస్ జగన్ హాజరయ్యారు. దివంగత దాసరి విగ్రహానికి పూలమాల వేసి వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి కుటుంబసభ్యులను పరామర్శించారు. రాజకీయ, సినీరంగాలకు దాసరి చేసిన సేవలను కొనియాడారు.  విదేశాల్లో ఉండటంతో దాసరిని కడసారి వైయస్‌ జగన్‌ చూడలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా దాసరి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు.

Back to Top