ఉక్కుమనిషికి ఘన నివాళి

హైదరాబాద్ః ఉక్కుమనిషి, మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లాభాయి పటేల్ జయంతి వేడుకలు వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సర్దార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. సర్దార్ ప్రతీ ఒక్కరికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అని వైయస్ జగన్ అన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 


కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మిథున్ రెడ్డి, అధికార ప్రతినిథులు వాసిరెడ్డి పద్మ, వేణుగోపాలకృష్ణ, వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Back to Top